లోక్ సభ బరిలోకి దిగబోతున్న ప్రభాస్ హీరోయిన్..!!

Divya
బిజెపి పార్టీ ఇటీవలే ఐదవ జాబితాను నిన్నటి రోజున విడుదల చేసింది. మొత్తం-111 మంది అభ్యర్థుల పేర్లను కూడా ఇందులో ఖరారు చేసింది. ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు కూడా ఉన్నది.. హిమాచల్ నుంచి ఈమె బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ లో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ బరిలో దిగబోతోంది.అయితే బిజెపికి బలమైన మద్దతుదారుల లిస్టులో కచ్చితంగా ఈ హీరోయిన్ పేరు ఉంటుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీకి ఎన్నోసార్లు బహిరంగంగాని మద్దతు పలుకుతూ ఉంటుంది.

ఈమె ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా పద్మశ్రీ పురస్కారం కూడా ప్రకటించింది. అప్పటినుంచి ఈమెకు బిజెపి తరఫున ఎన్నికలలో నిలవాలని చాలా ఆశగా ఉండేదట. తను కూడా సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాలలోకి వస్తానంటూ తెలియజేసేది ఇప్పుడు తాజాగా అదే నిజమయిందని తెలుస్తోంది.. కంగనా రనౌత్ తో పాటు బాలీవుడ్ నుంచి అరుణ్ గోవిల్ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో నిలవబోతున్నారు.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ స్థానం నుంచి ఆయన పోటీగా దిగబోతున్నారు. రామాయణం సీరియల్ నటించినప్పటి నుంచి అరుణ్ గోవిల్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

అయితే ఇటీవలే ఆర్టికల్స్ 370 సినిమాలు నరేంద్ర మోడీ పాత్రలో కూడా నటించారు.. అయితే ఈసారి కొంతమందికి పార్టీ టికెట్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ బీహార్ ,హర్యానా ,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, గుజరాత్, హర్యానా, మిజోరం, ఒడిస్సా ,రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించారు.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, తిరుపతి నుంచి వరప్రసాద్, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: