జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే అంటున్న వరలక్ష్మి...!!!

murali krishna
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెని వరిస్తున్నాయి.హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెని వరిస్తున్నాయి. రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ పాన్ ఇండియా సంచలనం హను మాన్ చిత్రంలో హీరో సోదరి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ వైవాహిక బంధంలో తొలి అడిగి వేసింది. ఇటీవల ఆమె నిశ్చితార్థం తన ప్రియుడితో జరిగింది. ముంబైకి చెందిన నిక్కోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో చాలా కాలంగా వరలక్ష్మి ప్రేమలో ఉంది. అంతే కాదు వీళ్లిద్దరి మధ్య 14 ఏళ్ళ నుంచి స్నేహం ఉందట.తాజాగా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 18 ఏళ్ళ వయసులోనే వరలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాయ్స్, కాదల్ లాంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ చేజార్చుకుందట. చిన్న వయసులో ఆ పాత్రలు వద్దని తన తండ్రి సలహా మేరకు అలా చేసిందట.
2012లో శింబు సరసన పోడాపోడి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆచిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు. దీనితో హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోవడం వరలక్ష్మికి కష్టంగా మారిందట. ఇక పర్సనల్ లైఫ్ గురించి కూడా వరలక్ష్మి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. తన లైఫ్ ఏదీ తాను అనుకున్నట్లు జరగలేదని పేర్కొంది.28 ఏళ్ళు వచ్చేసరికి స్టార్ హీరోయిన్ కావాలని అనుకుందట. అది జరగలేదు. 32 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని కూడా ప్రయత్నించిందట. అదీ జరగలేదు. 34 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బిడ్డని కనాలని ప్రయత్నించా అది కూడా జరగలేదు. త్వరగా తల్లిని కావాలనే కోరిక ఉండేది. ఇప్పుడు నా వయసు 38 ఏళ్ళు. ఇంతవరకు నేను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయా.పోడాపోడీ చిత్రం తర్వాత నా పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టా. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. నా కెరీర్ కోసం ఆ టైం వెచ్చించి ఉంటే సినీ కెరీర్ లో ఇంకా బాగా సక్సెస్ అయ్యేదాన్ని అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. అయితే తాను ఎదుర్కొన్న ఇబ్బందులే తనని దృడంగా మార్చాయని వరలక్ష్మి పేర్కొంది. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: