పెళ్లి చేసుకోబోతున్న బర్రెలక్క..!!

Divya
బర్రె లెక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు బాగా సిపరిచితమే ఈమె సోషల్ మీడియాలో కేవలం పెట్టిన ఒకే ఒక్క వీడియోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తను డిగ్రీ వరకు చదువుకున్నానని కానీ ఉద్యోగం రాలేదని దీంతో బర్రెలు కాసుకుంటున్నట్లు చెప్పడంతో ఈమె బాగా పాపులారిటీ సంపాదించుకుంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికార సమయంలో ఆ వీడియో పెద్ద ఎత్తున ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు.. అదే అదునుగా తనకు వచ్చిన పాపులారిటీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈమె ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది.

అయితే ఎన్నికల నేపథ్యంలో చేసిన హంగామా అంతా అంతా కాదు కాకపోతే ఆ ఎన్నికలలో ఈమె ఓడిపోవడం జరిగింది ఎంతోమంది రాజకీయ నాయకులు.. స్టార్లు సైతం ఈమెకు బాగానే సపోర్ట్ చేసినప్పటికీ పెద్దగా ఓట్లు రాలేదు. మరొకవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈమెకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే బర్రె లెక్క అతి త్వరలోనే వివాహం చేసుకోబోతుందని ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.. బర్రె లెక్క అసలు పేరు శిరీష ఈమె సోషల్ మీడియాలో తన వివాహం చేసుకోబోతున్నానంటూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.. గతంలో బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని శిరీష పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ అయితే వినిపించాయి.. అయితే వాటిపైన శిరీష కాస్త ఘాటుగానే స్పందించినది.. కాకపోతే ఇప్పుడు ఏకంగా తాను వివాహం చేసుకోబోతున్నట్లు స్వయంగానే ప్రకటించడం జరిగింది అందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. మరి త్వరలోనే వివాహ తేదీని కూడా తెలియజేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: