తడిసిన చీరలో బిగ్ బాస్ బ్యూటీ దివి అందాలు..!

Anilkumar
బిగ్బాస్ షో తో భారీగా క్రేజ్ సంపాదించుకున్న దివి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా భారీగా క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం బిగ్బాస్ షో కి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయ్యింది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా కనిపించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో కూడా కీలక పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అంతేకాదు తనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అలా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ల లాగా కంటిన్యూ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ భామ పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లకు కంటి మీద కునుకు కరువైపోతుంది. మోడ్రన్ డ్రెస్సులోనైనా, చీరకట్టులోనైనా ఇంప్రెస్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అని చెప్పకనే చెప్పేస్తుంది. పొట్టి డెస్సులోనైనా, సంప్రదాయ చీరకట్టు లోనైనా దివి అందాల ఆరబోసిందంటే సోషల్ మీడియా షేక్ అవడం పక్కా. అందమైన బీచ్‌..చీరలో

కాటుక కండ్ల దివి వైద్య ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఎలా ఉంటుంది. చూసేందుకు రెండు కండ్లు మాత్రం సరిపోవు. తాజాగా దివి బీచ్‌లో చిల్‌ అవుతూ చీరకట్టులో హొయలు పోతూ ఫొటోషూట్‌లో పాల్గొన్నది.  తడిసిన అందాలతో అలల మధ్య షికారు చేస్తూ సందడి చేసింది. తాజా లుక్స్‌లో సొగసు చూడతరమా పాటను మరోసారి గుర్తు చేస్తోంది. అందానికే అసూయ పుట్టించేలా ఉన్న దివి వైద్య ఫొటోలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. దివి ఈ ఏడాది లంబసింగి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవీన్‌ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 15న విడుదలైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: