వెంకటేష్ కోసం హాట్ బ్యూటీ ని ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..!?

Anilkumar
ఫ్యామిలీ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన చేసే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంత బాగా ఆకట్టుకుంటాయో మనందరికీ తెలిసిందే. కేవలం మగవాళ్ళు మాత్రమే సినిమాలు చూసే కాలంలో ఆడవాళ్ళని కూడా థియేటర్స్ కి రప్పించిన ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన నటించిన సైంధవ సినిమా ఇటీవల ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఏమాత్రం నిరాశపడలేదు. వెంకటేష్ సినిమా హిట్ అయిన ఫట్ట యినా


కూడా సినిమాలను చేస్తూనే పోతాడు వెంకటేష్. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు అన్న వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరొక వార్త కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది దాంతో ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా అనిల్ రావిపూడి తమన్నాను సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి - తమన్నా మంచి జాన్ జిగిడి దోస్తులు . గతంలో ఏదో వీళ్ళ మధ్య ఇష్యూ వచ్చింది అన్నారే కానీ అది అక్కడితోనే



 సాల్వ్ అయిపోయింది. ప్రజెంట్ తమన్న బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధపడుతుంది . పైగా వెంకటేష్ తో మంచి ర్యాపో కూడా తమన్నకు ఉంది . ఆల్రెడీ ఎఫ్2 ఎఫ్3 సినిమాల్లో నటించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది . అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా తమన్న ను చూస్ చూసుకున్నారట . తెరపై వెంకటేష్ - తమన్న ఫన్నీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారిపోతున్నాయట . మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: