Rc-16 లో విలన్ గా బాలీవుడ్ నటుడు..!!

Divya
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో నిన్నటి రోజున పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC -16 ను సైతం హైదరాబాదులో చాలా ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది.అలాగే కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ చిత్రానికి సంబంధించి విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ కూడా సంజయ్ దత్ కు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని పైన ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్ సంస్థ పైన ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తూ ఉన్నారు. rrr సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో భారీగానే హైప్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఓటిటి రైట్స్ కూడా ఈ సినిమా  రూ.100 కోట్లకు పైగా అమెజాన్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు పాటలు పోస్టర్లు గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: