ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయబోతున్న వర్మ..!!

Divya
టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే... ఆయన ఎలాంటి సినిమా అనౌన్స్మెంట్ చేసిన కూడా ఒక పెద్ద వివాదమే సృష్టిస్తూ ఉంటుంది.. సినిమాల కోసం ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. తన కదలని ఎవరు టచ్ చేయని పాయింట్తో టచ్ చేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటారు. అయితే మరొకసారి ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి వర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ ను రాంగోపాల్ వర్మ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందని వర్మ టీమ్ మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉన్నది.. తనకంటూ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. అలా స్టార్ డం సంపాదించిన తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదురవడం ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకుని మరణించారు.

అయితే ఉదయ్ కిరణ్ కు అప్పటికే వివాహం కూడా అయినది. ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఉదయ్ కిరణ్ ఎంతోమంది నటీనటులకు కూడా మంచి బాండింగ్ ఉన్నది. ఎన్నోసార్లు ఉదయ్కిరణ్ గురించి చాలామంది సెలబ్రిటీలు కూడా మాట్లాడడం జరిగింది. మరి రాంగోపాల్ వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ పైన ఎలా స్పందిస్తారో చూడాలి మరి.. ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించుతున్న చిత్రాలను కూడా ఎన్నో వివాదాలను తెర లేపుతూ ఉన్నాయి.. ఇటీవల కాలంలో వ్యూహం శపధం వంటి సినిమాలను చేసి వైరల్ గా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: