మరో వివాదంలో చిక్కుకున్న విజయ్ ఆంటోని..!?

Anilkumar
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈయన పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే సినిమా బిచ్చగాడు. ఇక ఈ సినిమాతో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే విజయ్ ప్రస్తుతం హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వెరైటీ కాన్సెప్ట్లతో సినిమాలను తీస్తున్నాడు. అయితే ఈయన మొదటిసారిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ జానెర్ లో నటిస్తున్న సినిమా లవ్ గురు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాళిని రవి కనిపించబోతోంది.

లవ్ గురు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. తమిళంలో ఈ చిత్రం రోమియోగా రిలీజ్ అవుతోంది. అయితే ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో మృణాళిని రవి శోభనం గదిలో మద్యం పోస్తూ బోల్డ్ గా కనిపించింది. దీనితో బాగా చర్చ జరిగింది. పెళ్లి కూతురు శోభనం గదిలో మద్యం సేవించడం ఏంటి అంటూ

ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీనికి వివరణ ఇచ్చే క్రమంలో విజయ్ ఆంటోని చిక్కుల్లో పడ్డాడు. క్రీస్తుపై విజయ్ చేసిన ఈ కామెంట్స్ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. దీనితో వెంటనే క్రైస్తవులు విజయ్ ఆంటోని కామెంట్స్ కి రియాక్ట్ అవుతున్నారు. విజయ్ ఆంటోని క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. క్రీస్తు మద్యం సేవించినట్లు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. తన కామెంట్స్ వివాదంగా మారడంతో విజయ్ కూడా స్పందించాడు. తన మాటలని తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ద్రాక్ష రసం రెండువేల ఏళ్ల క్రితమే దేవాలయాల్లో చర్చిలలో ఉపయోగించేవారు. నేను ఆ ఉద్దేశంతో అన్నాను అని ఈ సందర్భంగా వెల్లడించాడు విజయ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: