వావ్:గేమ్ ఛేంజర్ ఓటిటి హక్కులు అన్ని కోట్లా..?

Divya
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే ఓటీటి హక్కులు కూడా అమ్ముడుపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఓటిటి హక్కులను సైతం ప్రముఖ ఓటీపీ ప్లాట్ ఫామ్ అమెజాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమెజాన్ స్వయంగా ఇటీవలే వెల్లడించింది..గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ఏకంగా రూ.105 కోట్లకు డీల్ కుదిరిచినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ఈ వార్త విన్న రామ్ చరణ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు.

నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తూ ఉన్నారు. రామ్ చరణ్ కు జోడిగా  కియారా అద్వానీ నటిస్తోంది. ఎన్నికలు రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉన్నట్లుగా తాకు వినిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రభినయం లో నటిస్తున్నారని ఒక పాత్ర ఐఏఎస్ అధికారి అని ఇటీవలే రిలీజ్ అయిన పోస్టర్లు కూడా కనిపించాయి. అయితే మరొక పాత్ర కాస్త సస్పెన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఓటీటి మధ్య భారీ విపరీతమైన పోటీ ఉండడం చేత కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు సొంతం చేసుకోవడానికి పలు రకాల ఓటీటి సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఇందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లో విడుదలైన కొన్ని నెలల తర్వాతే పోటీలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. rrr సినిమా తర్వాత రామ్ చరణ్ కు మంచి డిమాండ్ పెరిగిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగింది. నిన్నటి రోజున RC -16 చిత్రానికి సంబంధించి సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రంలో రాంచరణ్ నటించిగా.. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: