ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిన హీరోయిన్ అనిత..!!

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించారు. అయితే హఠాత్తుగా ఈ లోకం విడిచి వేళ్లి పోయిన ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఉంటే స్టార్ హీరోగా అయ్యేవారు అంటూ అభిమానులు సైతం ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటారు. చిత్రం సినిమాతో మొదటిసారి తన కెరీర్ను మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఉదయ్ కిరణ్ కు ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నువ్వు నేను సినిమా కూడా విడుదలయ్యింది.

ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా ఒక ప్రకంపనం సృష్టించింది. ముఖ్యంగా యువత ఈ సినిమాను ఎక్కువగా ఆదరించారు. ఒక అందమైన ప్రేమ కథగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ కు జోడిగా అనిత అనే అమ్మాయి నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి దాదాపుగా 23 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రిలో ఎక్కువగా రీ రిలీజ్ ల సినిమా హవా కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు కాల్టు క్లాసికల్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

రేపటి రోజున నువ్వు నేను సినిమాని మరొకసారి ప్రేక్షకుల ముందుకు రీ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నువ్వు నేను సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరోయిన్ అనిత ఒక వీడియోను విడుదల చేసింది.. కొద్దిరోజుల క్రితం తన సోషల్ మీడియాలో ఒక వీడియోతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నేను సినిమా మరొకసారి థియేటర్లో విడుదల చేస్తున్నందుకు నేను ఉదయ్ మా మూవీ టీమ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము.. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. మరొకసారి నువ్వు నేను సినిమాను ఆదరిస్తానని ఆశిస్తున్నానని వెలిగింది.. అలాగే ఉదయ్ నేను నీ ఫ్యాన్ ని నిన్ను చాలా మిస్ అవుతున్నాం నువ్వు ఇదంతా చూస్తావ్ అనుకుంటున్నాను అంటూ వెల్లడించింది అనిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: