సత్యం రాజేష్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ "టెనెంట్‌"?

Chakravarthi Kalyan
సత్యం రాజేష్, వై.యుగంధర్, మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, మహాతేజ క్రియేషన్స్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'- ఏప్రిల్ మూడో వారంలో విడుదలకు సిద్ధమౌతున్న చిత్రం ఇది
'పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు చక్కటి స్పందన వచ్చింది.

ప్రజెంట్ జనరేషన్ లో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం టెనెంట్‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. జెమిన్ జోమ్ అయ్యనేత్ డీవోపీ కాగా విజయ్ ముక్తవరపు ఎడిటర్.

ఇక ఈ సినిమా కాస్టింగ్‌ విషయానికి వస్తే.. ఇదీ జాబితా.. సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ, ధనా బాల, చందు , అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు నటించారు.

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: వై. యుగంధర్
నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
సహ నిర్మాత : రవీందర్ రెడ్డి .ఎన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ
సంగీతం : సాహిత్య సాగర్
DOP: జెమిన్ జోమ్ అయ్యనేత్
ఎడిటర్: విజయ్ ముక్తవరపు
కథ: యస్ శ్రీనివాస వర్మ
కో-డైరెక్టర్: అనిల్ కడివేటి
స్టంట్స్: రబిన్ సుబ్బు
ఆర్ట్: కరకరల చంద్ర మౌళి, సాయి  
ప్రొడక్షన్ కంట్రోలర్:బి. రాంబాబు  
డిజిటల్ మీడియా : వినీత్-సందీప్
పీఆర్వో: తేజస్వి సజ్జా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: