"బీమా" కి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 7 రోజుల్లో నైజాం ఏరియాలో 2.40 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1 కోటి ... ఏపీ లో 2.66 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 రోజుల్లో 6.06 కోట్ల షేర్ ... 10.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 62 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.68 కోట్ల షేర్ ... 11.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 5.32 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.