ఆ స్టార్ హీరోయిన్ తో చచ్చిన సినిమా చెయ్యను అంటున్న రామ్ చరణ్..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా  లెవెల్ లో విడుదల కాబోతున్నాయి. ఇక సాధారణంగా రామ్ చరణ్ సినిమాలు చేసేటప్పుడు సినిమా కథనం

 దర్శకుడుని దృష్టిలో పెట్టుకొని సినిమాకి పనిచేస్తాడు. మిగతా విషయాలను ఏవి కూడా పట్టించుకోడు. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఏ హీరోయిన్ ఉండాలి ఎవరు ఉండకూడదు అన్న అన్ని విషయాలను రామ్ చరణ్ దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు గా తెలుస్తోంది. తనకు ఇష్టం లేని హీరోయిన్ తీసుకొచ్చి సినిమాలో పెట్టాలి అని దర్శకుడు నానా ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ తర్వాత ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ దర్శకుడు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచాడట.  అసలు వద్దని చెప్పినా తీసుకొచ్చి పెట్టారు..

మాటంటే అంత లెక్కలేదా? అంటూ కోపంతో ఊగిపోయాడంట. ఆ హీరోయిన్ ఉంటే సినిమా చేసేది లేదంటూ సెట్ నుంచి వెళ్లిపోయారు  దీంతో ఆ హీరోయిన్ ను తీసేసి ఆమె స్థానంలోకి అమలాపాల్ ను తీసుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే.. నాయక్. దీనికి దర్శకుడు వినాయక్. కాజల్, అమలాపాల్ కథానాయికలుగా నటించారు. రామ్ చరణ్ కెరీర్ లోనే మంచి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఆ హీరోయిన్ ఎవరు? ఆమెతో ఎన్నిరోజులు షూటింగ్ చేశారు? ఎందుకు రామ్ చరణ్ వద్దన్నాడు? వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం ఏమిటి? తదితర విషయాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: