"హనుమాన్" ఓటిటి విడుదలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన "జీ5" సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా "ఓ టి టి" విడుదలకు సంబంధించి అనేక రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
 

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా మార్చి 8 వ తేదీన "జీ 5" ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ సినిమా ఆ తేదీన "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఆ తర్వాత పలుమార్లు ఈ సినిమా "ఓ టి టి" విడుదలకు సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమా "ఓ టి టి" హక్కులను దక్కించుకున్న "జీ 5" సంస్థ వారు ఈ సినిమా "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. "జీ 5" సంస్థ వారు తాజాగా హనుమాన్ సినిమాని త్వరలో తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: