నెక్స్ట్ లెవెల్లో కల్కి ప్రమోషన్స్.. టీజర్, ట్రైలర్ అప్పుడే?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ  సినిమాపై ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇకపై అసలైన ఆయుధాలతో ఇంకా అస్త్రాలతో కల్కి మూవీ ప్రమోషన్స్ జరగనున్నాయని నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉన్న అప్ డేట్స్ తో మేకర్స్ రిలీజ్ సమయానికి అంచనాలను పెంచనున్నారని సమాచారం తెలుస్తుంది. ఈ నెల 31వ తేదీన బుజ్జి, భైరవ పాత్రలకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ కానుంది.టీజర్, ట్రైలర్ కు సంబంధించి కూడా వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. జూన్ 16 లేదా 17 తేదీల్లో టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల కానున్నట్టు సమాచారం తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఖచ్చితంగా ఈ సినిమాతో రాజమౌళి  స్థాయి డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా విడుదల అయిన గ్లింప్స్, టీజర్ అన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్ సలార్ సినిమా తర్వాత నటించి రిలీజవుతున్న సినిమా కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.


ఈ మధ్య కాలంలో థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం కూడా కల్కి సినిమాకి ఎంతగానో కలిసొస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పుష్ప ది రూల్ సినిమా విడుదలయ్యే వరకు కల్కి సినిమాకు ఇక పోటీ లేనట్టేనని కామెంట్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. గ్లోబుల్ రీచ్ వస్తే బాహుబలి, దంగల్ వసూళ్లని మించిపోవడం పక్కా. పైగా ప్రభాస్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుండటం గమనార్హం. ఇక కల్కి 2898 ఏడీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో దీపిక  రోల్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.దిశా పటానీ  ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ పాత్రలు కూడా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాపై ఇతర భాషల్లో కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కల్కి సినిమా భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని ఫ్యాన్స్ నుంచి అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ చక్రం సినిమా జూన్ 8 వ తేదీన రీ రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: