రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..!?

Anilkumar
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో పాల్గొన్న రతిక రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన అందం తోపాటు మంచి మంచి పాటలను పాడుతూ ఒకింత మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఈ బ్యూటీ. కానీ ఇంట్లో చేసే పనులతో బయట మాత్రం విపరీతమైన నెగెటివిటీ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై ఆమె వ్యవహరించిన తీరు వల్ల అతనికి బయట భారీ రేంజ్ లో నెగెటివిటీ వచ్చింది. కానీ మళ్ళీ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ మళ్ళీ అది నెగిటివిటీతో బయటికి వచ్చింది.

అయితే గతంలో ఈమె చాలా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. కానీ బిగ్బాస్ తర్వాత తనకి మెయిన్ లీడ్ లో నటించే అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ కి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా కోకంటెస్టెంట్లతో కలవని ఈమె.. కెరియర్ లో ముందుకు వెళ్లేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈమె అందం,

అభినయానికి ఫిదా అయిన కొందరు తనకు సినిమాల్లో.. హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారట. ముఖ్యంగా తమిళంలో ఓ పెద్ద ప్రొడక్షన్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని.. అయితే దాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించిన తర్వాతే తాను కూడా రివీల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. మొదటి వారంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో అడుగు పెట్టిన ఈమె.. రైతుబిడ్డతో వ్యవహరించిన తీరుతో నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. విపరీతమైన నెగిటివిటీ రావడం.. అందులోనూ అమ్మాయి కావడంతో ఈమెకు మరో ఛాన్స్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: