పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాపై ఇప్పటికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై

కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీంతో ఆయన చేసిన పలు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వస్తా భగత్ సింగ్ సినిమా షూట్ చేసింది కేవలం ఐదు రోజుల్లో మాత్రమేనని టీజర్ సైతం ఆ ఐదు రోజుల షూటింగ్ కు సంబంధించిందే అని ఈ సందర్భంగా హరిష్ శంకర్ చెప్పకు వచ్చారు. ఐదు రోజుల్లో ఎంత షూట్ చేశామంటే 15 రోజుల్లో ఎంత షూట్ చేస్తామో అంత చేశామని హరీష్ శంకర్ పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు ఏ వైబ్ పవన్ లో ఉందో అదే వైబ్, అదే ఎనర్జీ పవన్ కళ్యాణ్ లో ఉందని ఆయన వెల్లడించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏంటో సినిమాలోనే చూపిస్తానని హరీష్ శంకర్ పేర్కొన్నారు. హరీష్ శంకర్ కామెంట్లతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎన్నికల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో శ్రీలీల  హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. హరీష్ శంకర్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: