బాలయ్య సినిమాలో మరో మలయాళ హీరో.. ఈసారి ఏకంగా అలాంటి పాత్రలో..!?

Anilkumar
టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ బాబి కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దుల్కర్ సల్మాన్ తనదైన నటన తో ప్రస్తుతం తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. కాగా ఇప్పుడు నటి సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు అని తెలిసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం

 మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో పాటు మరొక మలయాళ హీరో మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ షైన్ టామ్ చాకో ను కూడా ఈ సినిమాలో తీసుకున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. ఆయనది విలన్ పాత్ర అని కూడా అంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు..దసరా మూవీ తర్వాత నాగశౌర్య

 ‘రంగబలి’ సినిమాలోనూ ఆయన విలన్ రోల్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా తెలుగులో విలన్ గా ఆయనకు హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతుంది. ఈ సినిమాలో సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న స్టార్ ఆర్టిస్ట్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎంపికయ్యారు. ‘యానిమల్’ సినిమాతో ఆయనకు హిందీలో ఏ స్థాయి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబీ డియోల్ చేరికతో హిందీ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. అలాగే తమిళ దర్శకుడు, నటుడిగా ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: