
'వార్-2'.. సగం బడ్జెట్ హీరోల రెమ్యూనరేషన్ కే పోయిందిగా?
హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇక ఈ మూవీకి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తూ ఉండగా.. ఇక మరో హీరోగా అటు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఇక ఇప్పుడు ఈ వార్ 2 లో నటిస్తున్న హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ ల పారితోషకం ఎంత ఉంటుంది అనే విషయంపై ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ దొరకెక్కుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ బడ్జెట్లో సగం వరకు కూడా హీరోల పారితోషకం కోసమే ఖర్చు అవుతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇక ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. ఇక మరోవైపు హ్రుతిక్ రోషన్ కూడా అంతే మొత్తంలో పారితోషకం అందుకుంటున్నాడు అన్నది తెలుస్తోంది. అయితే కేవలం 100 రోజుల కాల్ షీట్స్ కోసమే ఈ ఇద్దరు హీరోలు 100 కోట్లు తీసుకుంటూ ఉన్నారట. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే ఇద్దరు హీరోలకు ఒక్క రోజుకి కోటి చొప్పున రెమ్యూనరేషన్ అందుతుందట.