యాంకరింగ్ వదిలేసి బాడీ పెంచుతున్న ప్రదీప్ సినిమా కోసమేనా..??
కాగా ప్రదీప్ సడన్ గా బుల్లితెరకు దూరం అయ్యాడు. ప్రదీప్ ఢీ షోలో కనిపించడం లేదు. ఆయన స్థానంలో నటుడు నందు వచ్చాడు. ఢీ తో పాటు ఇతర షోలలో కూడా ప్రదీప్ కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రదీప్ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశాడనే టాక్ వినిపిస్తుంది.ఈ ఊహాగానాల మధ్య ప్రదీప్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రదీప్ జిమ్ లో విపరీతంగా కష్టపడుతున్నాడు. అతడు కండలు తిరిగిన శరీరం కలిగి ఉన్నాడు. ప్రదీప్ మేకోవర్ షాక్ ఇస్తుంది. ఆయన లుక్ ఆకట్టుకుంది. దీంతో ప్రదీప్ తన నెక్స్ట్ మూవీ కోసమే ఇలా మేకోవర్ అవుతున్నాడనే వాదన మొదలైంది.గతంలో పలు చిత్రాల్లో ప్రదీప్ చిన్న చిన్న పాత్రలు చేశాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంతో హీరో అయ్యాడు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. హీరోగా చేసినా యాంకరింగ్ వదల్లేదు. ఆ మూవీ ఫలితం అనంతరం ప్రదీప్ వెండితెర జోలికి పోలేదు. మరి ఇప్పుడు యాంకరింగ్ వదిలేసి బాడీ పెంచుతున్న ప్రదీప్ సినిమా కోసమే కావచ్చు అనిపిస్తుంది.అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలు గినిమాలు మనకు వద్దు. హాయిగా యాంకరింగ్ చేసుకుందాం. మీరు మరలా బుల్లితెరకు వచ్చేయ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు మేటర్ ఏంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.