సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధనుష్ కుబేర మూవీ స్టోరీ..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా స్ప్రైట్ సినిమాలు చేస్తూ తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటున్నాడు ధనుష్. ఇక తాజాగా ధనుష్ రష్మిక మందన కాంబినేషన్లో వస్తున్న సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

కాగా తాజాగా శివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ మరియు ధనుష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో కనిపించాడు. ఒక గోడపై శివుడికి ఆహారం పెడుతున్న పార్వతి ఫోటోను చూపించారు. ఇక ఈ పోస్టర్ తరువాత ఇదొక రియల్ కథను ఇన్స్పిరేషన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ చూసాకా.. కుబేర కథ ఇదే అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. కుబేరుడు గురించి అందరికి తెల్సిందే. కుబేరుడు ముందు జన్మలో గుణనిధిగా పుట్టాడు. అతని కథనే శేఖర్ కమ్ముల ఆధారంగా చేసుకున్నాడంట.

గుణనిధి.. వ్యసనాలకు అలవాటు పడి, త్వరగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు, దోపిడీలు చేసి డబ్బు సంపాదించేవాడు. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధి తండ్రికి ఈ విషయం తెలియడంతో ఎక్కడ తనను చంపేస్తాడేమో అని భయపడి గుణనిధి.. ఒక శివాలయంలో దాక్కుంటాడు. అక్కడ తినడానికి తిండి లేక అలమటిస్తాడు. ఇక గుడిలో జాగారం చేసిన భక్తులకు పుణ్యం దక్కే పని చేసాక కాలుజారీ నంది తల తగిలి చనిపోతాడు. ఇక ఆ పుణ్యమే.. తరువాతి జన్మలో అతడిని కుబేరుడుగా పుట్టించినట్లు సూత మహర్షి తెలిపాడు.  ఇక ఇదే కథను ఇప్పటికాలానికి అనుగుణంగా శేఖర్ చూపించనున్నాడు అని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ కదా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: