రోహన్ రాయ్ కి రెమ్యూనరేషన్ అన్ని లక్షలా..!!!
ఇప్పుడు రోహన్ రాయ్ రెమ్యూనరేషన్ వివరాలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆ అంకె విన్న తర్వాత ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మనోడు ఇప్పుడు ప్రాజెక్ట్ లెక్క కాకుండా రోజుల లెక్క రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంట. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. రోజుకు రూ.30 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నాడంట. అంటే ఎన్నిరోజులు షూటింగ్ ఉంటే అన్ని రోజులు.. నిర్మాత రోజుకు రూ.30 వేలు ఇవ్వాలి. పైగా రోహన్ రాయ్ ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అయ్యింది కాబట్టి.. రానుపోనూ ఫ్లైట్ ఛార్జెస్, హోటల్ స్టే యాడాన్ అనమాట. ఇలా చూసుకుంటే.. రోహన్ రాయ్ కి రోజుకు ఖర్చు రూ.40 నుంచి 50 వేలు అవుతుంది.ఒక చిన్న రోల్ వచ్చినా కూడా దానిని షూట్ చేయాలి అంటే నెల రోజులు అయినా పడుతుంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ వచ్చిందంటే.. 60 రోజులు షూటింగ్ ఉంది అనుకుందాం. అప్పుడు 60 రోజులకు రూ.30 వేలు చొప్పున వేసుకుంటే.. రోహన్ రాయ్ కి రెమ్యూనరేషన్ కింద రూ.18 లక్షలు ఇవ్వాలి. ట్రావెలింగ్, స్టే ఖర్చులు అదనం. ఇలా చూసుకుంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గట్టిగానే సంపాదిస్తున్నాడు. అయితే ఎవరికీ ఏదీ ఊరికే ఇచ్చేయరు అనే విషయాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి. రోహన్ రాయ్ కి అంత ఇచ్చి అవకాశాలు ఇస్తున్నారు అంటే అది అతని టాలెంట్ అనే చెప్పాలి. 90's సిరీస్లో కూడా రోహన్ కు ఊరికే అవకాశం రాలేదు. ఆడిషన్స్ పెట్టి.. ఆ రోల్ అతనికి సెట్ అవుతుందని నమ్మిన తర్వాతే ఇచ్చారు. కాబట్టి ఎన్ని లక్షలు తీసుకున్నా అది అతని టాలెంట్ ని బట్టే వస్తోంది. పైగా మనోడికి మిమిక్రీ, ఇమిటేషన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. మరి.. సుద్దపూస బుడ్డోడు రోహన్ రాయ్ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.