ఆ తేదీన ఆరెంజ్ రీ రిలీజ్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మెగా బ్రదర్ నాగ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇకపోతే మగధీర లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై ఆ సమయంలో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడం మాత్రమే కాకుండా ఈ సినిమా నాగ బాబు కు భారీ మొత్తంలో నష్టాలను కూడా మిగిల్చింది. ఇలా ఆ సమయం లో భారీ అపజయాన్ని ఎదుర్కొన్న ఈ సినిమాను కొంత కాలం క్రితమే థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా మొదటి సారి రీ రిలీజ్ లో  ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన ఈ సినిమాను మరోసారి థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. 

ఇకపోతే మార్చి 27 వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భం గా ఈ సినిమాను థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా రెండవ సారి రీ రిలీస్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర  వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: