రివ్యూ: భూతద్ధం భాస్కర్ నారాయణ

Chakravarthi Kalyan
డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ బేస్ వుంటుంది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రమోషనల్ కంటెంట్ ఈ జోనర్ ప్రేక్షకులని ఊరించింది. డిటెక్టివ్ కథకు పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా?  భూతద్ధం భాస్కర్ నారాయణ టేకాప్ చేసిన కేసులోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా?
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల తల నరికేసి ఆ స్థానంలో దిష్టిబొమ్మని పెడతాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలుగా పిలుస్తారు పోలీసులు. ఈ సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి రంగంలో దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). మరి ఈ కేసుని చేధించాడా? ఈ కేసుకిపురాణాలకి మధ్య వున్న లింక్ ఏమిటి ? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేది తక్కిన కథ.
ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం భలే కుదిరింది. నిజానికి ఇలాంటి కంటెంట్ తెలుగులో సినిమాలు రాలేదనే చెప్పాలి.  హీరో చైల్డ్ వుడ్ ఎపిసోడ్ తో మొదలుపెట్టిన దర్శకుడు ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు. ఫన్ ఎలిమెంట్స్ తో పాటు లవ్ ఎమోషన్ పర్వాలేదనిపిస్తాయి. అయితే సీరియల్ కిల్లింగ్స్ తెరపైకి వచ్చిన తర్వాత కథ చాలా ఉత్కంఠగా ముందుకు సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. ద్వితీయార్ధంలో  వచ్చే మలుపులు ప్రేక్షకులని మరితంగా అలరిస్తాయి.
నటీనటులు: శివ కందుకూరి, భాస్కర్ నారాయణ పాత్రలో ఒదిగిపోయాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు, ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా వుంది. ఆ పాత్రతో మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. తన పెర్ఫామెన్స్ చాలా ప్రామెసింగ్ గా వుంది. యాక్టింగ్ లో మంచి యీజ్ చూపించాడు. రిపోర్టర్ లక్ష్మీ పాత్రలో చేసిన  రాశి సింగ్ నటన బావుంది. మిగతానటీనటులు కథకు బాగా హెల్ప్ అయ్యారు.  
 టెక్నికల్ గా శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఈ సినిమాకి బిగ్ ఎసెట్.  థ్రిల్లింగ్ మూడ్ ని బాగా ఎలివేట్ చేశాడు. తన సంగీతంలో కూడా ఒక రూరల్ టచ్ కనిపించింది. కెమరాపనితనం రిచ్ గా వుంది. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. విఎఫ్ఎక్స్ అవుట్ పుట్ బాగానే వుంది. దర్శకుడు చెప్పిన కంటెంట్ లో కొత్తదనం వుంది. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులు భూతద్ధం భాస్కర్ నారాయణ నచ్చుతాడు.
రేటింగ్‌ 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

bbn

సంబంధిత వార్తలు: