హనుమాన్ ఓటిటి: ఆఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది?

Purushottham Vinay
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల నుంచి అశేష ఆదరణ పొంది భారీ విజయం సాధించింది.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లో  పాన్ వరల్డ్ మూవీగా రిలీజయ్యింది. అయితే కేవలం తెలుగు, హిందీ భాషల్లోన్నే భారీ హిట్ కొట్టింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఇప్పుడు మూవీ లవర్స్, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.హనుమాన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇక హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై చాలా రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో ఫిబ్రవరిలోనే విడుదల చేద్దామనుకున్నారు. కానీ, అప్పటికీ ప్రేక్షకులు థియేటర్‌లలో హనుమాన్‌ సినిమాని చూడటంతో మార్చి నెలకు వాయిదా వేశారు. మొదట మార్చి 1 లేదా 2వ తారీఖున హనుమాన్ సినిమాని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.


దీంతో సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.ఇక తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ రెండు తేదీలు కాకుండా మరో తేదీని అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ. హనుమాన్ మూవీని ఇంకాస్తా లేటుగా మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ని ఇచ్చింది జీ5. మార్చి 8న మహాశివరాత్రి పండుగతోపాటు ఆరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా. వీటి సందర్భంగా ఆరోజు నుంచి ఓటీటీలో హనుమాన్ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది జీ5 సంస్థ.హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వచ్చినట్లు ఇంతకముందు ప్రచారం జరిగింది.ఇక హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తే వినయ్ రాయ్ విలన్‌గా చేశాడు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: