చిరు "విశ్వంభర" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బింబిసారా సినిమాతో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష మెగాస్టార్ చిరంజీవి కి జోడి గా నటిస్తోంది. యువ నటీమనులు అయినటువంటి ఇషా చావ్లా , సురభి కూడా ఈ మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమాను కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా విడుదల చేయాలి అనే ఉద్దేశంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది ... ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ శివార్లలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు మెగాస్టార్ చిరంజీవి తో పాటు మరి కొంత మంది నటీనటులతో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కి ఎం ఎం కీరవాణి అద్భుతమైన ట్యూన్ ను అందించినట్లు ... ఈ సాంగ్ ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ ఫాంటసీ ... అడ్వెంచర్ కథతో రూపొందుతుంది. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ , అడ్వెంచర్ మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: