రావణబ్రహ్మ గా బాలకృష్ణ !

Seetha Sailaja

పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు నందమూరి తారకరామారావు. 1960 ప్రాంతంలో ఎన్టీఆర్ రావణబ్రహ్మ గా నటించిన ‘సీతారామ కళ్యాణం’ ఒక క్లాసిక్. ఆ సినిమా ఘన విజయానికి మూలకారణం ఎన్టీఆర్ నటించిన రావణబ్రహ్మ పాత్ర. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘కన్నప్ప’ మూవీలో రిపీట్ కాబోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో హేమాహేమీలు నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ శివరాజ్ కుమార్ మోహన్ లాల్ లు ఇప్పటికే ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి బాలకృష్ణ కూడ వచ్చి చేరుతున్నట్లు లీకులు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పైగా పూర్తి అయిన పరిస్థితులలో ఈ మూవీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని స్వయంగా మంచి విష్ణు నిర్మిస్తున్న విషయం నిర్మిస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం మంచు విష్ణు కెరియర్ అంతంత మాత్రంగా ఉండటంతో ఈ మూవీని ఎట్టిపరిస్థితులలోను హిట్ చేసి తీరాలి అన్న పట్టుదల వల్ల ఈ మూవీ ప్రాజెక్ట్ లోకి హేమాహేమీలు వచ్చి చేరుతున్నారు అని అంటున్నారు. రాబోయే శివరాత్రి పండుగ రోజున ఈ మూవీలో శివుడు పాత్రలో నటిస్తున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ ను బయటపెడతారని టాక్.

ఈసినిమా కథ రీత్యా ఈమూవీలో రావణబ్రహ్మ పాత్ర కూడ ఉండబోయే నేపధ్యంలో ఈపాత్ర కోసం స్వయంగా మోహన్ బాబు రంగంలోకి దిగి బాలకృష్ణను రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బాలయ్య రాబోయే ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు కొత్త సినిమాల విషయం పక్కకు పెట్టిన పరిస్తితులలో బాలయ్య తన రావణబ్రహ్మ పాత్ర విషయమై తన నిర్ణయం చెపుతానని మంచు విష్ణుతో అన్నట్లు తెలుస్తోంది..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: