సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సమీరా రెడ్డి వ్యక్తిగత విషయాలు..!!
'ఒకానొక సమయంలో ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉండటానికి.. నా మానసిక , శారీరిక ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాను. నేను సైజుల కోసం ఫ్యాడ్ లను ప్రయత్నించాను.. షూట్ తర్వాత వ్యాయామం చేయడం వంటివి చాలా హాస్యాస్పదమైన పనులు చేశాను. అప్పుడు నేను చేసిన దాని ఫలితంగా ఇప్పుడు హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడింది. పర్యవసానాలు వయస్సుతో పాటుగా ఉంటాయి.. ఈ రోజు అలాంటి ఆప్షన్ ను ఎన్నుకున్నందుకు బాధపడుతున్నాను. కానీ, అప్పటికి నాకు మరే ఇతర ఆప్షన్ లేదు. ఇతరుల నుంచి నేను పొందిన పరిశీలన కంటే.. నాకు నేనుగా చేసుకున్న పరిశీలనలు నాకు బాగా ఉపయోగపడేవి. యంగ్ ఏజ్ లో ఉన్నపుడు నేను బొద్దుగా ఉండే అమ్మాయిని. అందంగా ఉండడం కోసం ఆ ఏజ్ లో ఉన్న అమ్మాయిలంతా కష్టపడుతుంటే.. నేను మాత్రం వారందరికీ భిన్నంగా ఉండేదాన్ని.ఆ తర్వాత నటిగా మారిన తర్వాత నాలో ఇన్సెక్యూరిటీస్ బాగా పెరిగిపోయాయి. నేను ముదురు రంగు చర్మంతో, బొద్దుగా, మందపాటి అద్దాలు ధరించి, అందవిహీనంగా ఉండేదాన్ని. స్ట్రెచ్ మార్క్స్, గ్రే హెయిర్, హార్మోన్ల అసమతుల్యత గురించి చర్చించడానికి .. సోషల్ మీడియా నన్ను అనుమతించింది. నేను ఇప్పటివరకు ఎదుర్కొన్న ఎన్నో అనుభవాల గురించి.. సోషల్ మీడియాలో చర్చించడం ప్రారంభించాను. మొదట్లో ప్రజలు సానుకూలంగా స్పందించలేదు. అయితే, నేను వ్యక్తులను నిందించను.. అందం కోసం వారు చేసే ప్రయత్నాలను కూడా ఆపను. అది ఎవరికీ వారు నిర్ణయించుకునేది. నేడు అన్ని పరిస్థితులు మారాయి. ఎవరు పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉండనవసరం లేదు.' అంటూ సమీరా పేర్కొన్నారు. మరి, నటి సమీరా రెడ్డి చర్చించిన తన వ్యక్తిగత విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.