ఫిదాని మించే కథ అయితేనే చేద్దాం అనుకున్నాం..!

shami
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ని బాగా చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాను యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయాలని ఆరాటపడుతున్నారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటించింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవితో మరో సినిమా ఎందుకు చేయలేదనే ప్రశ్న ఎదురైంది. దానికి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఫిదా తర్వాత తామిద్దరం సినిమా చేస్తే దానికి మించి ఉండేలా చేయాలని అనుకున్నాం అందుకే మళ్లీ చేయలేదు. తప్పకుండా ఫ్యూచర్ లో సాయి పల్లవితో కలిసి నటిస్తానని చెప్పాడు వరుణ్ తేజ్.
ఇక ఇండస్ట్రీలో తనకు నితిన్ మంచి స్నేహితుడని.. సాయి ధరం తేజ్ తో మల్టీ స్టారర్ చేయాలని ఉందని మంచి కథ దొరికితే మల్టీస్టారర్ కి రెడీ అంటున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు గద్దలకొండ గణేష్ సీక్వెల్ కథ రెడీ చేస్తే అందులో కూడా తాను నటించడానికి ఓకే అనేస్తున్నాడు వరుణ్ తేజ్. మొత్తానికి వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లోనే ఉన్నాడని అర్ధమవుతుంది. ఫిదా తోనే సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె క్రేజ్ రేంజ్ ఏంటన్నది తెలిసిందే. మళ్లీ వరుణ్ తేజ్ తో సాయి పల్లవి కలిసి నటించే సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: