నటి అన్నపూర్ణ మాటలకు ఫైర్ అయిన సింగర్ చిన్మయి..??

murali krishna
వందలాది సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించారు నటి అన్నపూర్ణ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చేయని పాత్ర లేదు అనే చెప్పాలి. అప్పటి హీరోల ల నుంచి ఇప్పటి యంగ్ హీరోల ల వరకు నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అన్నపూర్ణ.ప్రస్తుతం బామ్మ పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిల గురించి అన్నపూర్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆడవాళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్నపూర్ణ మాట్లాడుతూ.. 'అసలు అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా.? ఆడదానికి స్వాతంత్య్రం ఎందుకు కావాలి.? రాత్రి 12 గంటల తర్వాత ఆడవాళ్లకు ఏం పని.? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ అలా ఉంది. వాళ్ళు మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఆనేలాగే రెడీ అయ్యి వెళ్తున్నాము . ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనది కూడా కొంచెం ఉంటుంది' అని చెప్పుకొచ్చారు అన్నపూర్ణ.ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేస్తూ సింగర్ చిన్మయి రియాక్ట్ అయ్యారు. సింగర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న చిన్మయి. సమాజంలో జరిగే వాటి పై కూడా రియాక్ట్ అవుతుంటుంది. తాజాగా అన్నపూర్ణ మాట్లాడిన వీడియో క్లిప్ ను షేర్ చేసిన చిన్మయి. అన్నపూర్ణ కామెట్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది.
చిన్మయి మాట్లాడుతూ.. నేను అన్నపూర్ణ నటనకు అభిమానిని. ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే నా గుండె ముక్కలైనట్లు అనిపిస్తోంది. ఫేవరెట్ అనుకున్నవాళ్లు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆమె చెప్పినదాని ప్రకారం.. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ జరిగినా ఉదయం సాయంత్రం మధ్యలోనే జరగాలి. ఆ తర్వాత లేడీ డాక్టర్స్‌, నర్సులు ఉండకూడదు అన్నట్టు ఉంది. ఆమె చెప్పినట్లు రాత్రి సమయంలో మహిళా డాక్టర్లే ఉండొద్దు. ఆరోగ్యం బాగోలేకపోయినా రాత్రి ఆస్పత్రిలో ఉండకూడదు. ఆమె చెప్పిన రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండరు, ఉండకూడదు కాబట్టి.! ఇంట్లో బాత్రూం లేకతెల్లవారుజామునే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా ఉన్నారు. ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా.? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా.? అని ఎదురుచూస్తున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇండియాలో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని చెప్పుకొచ్చింది చిన్మయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: