"బీమా" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కన్నడ సినిమా దర్శకుడు అయినటువంటి హర్ష దర్శకత్వం వహించగా ... ప్రియ భవాని శంకర్ , మాళవికా శర్మ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. రవి బస్రుర్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే కే రాధా మోహన్ నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం అలాగే ఇందులో గోపీచంద్ తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 5.5 మిలియన్ వ్యూస్ ... 130.5 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే గోపీచంద్ ఆఖరుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీమార్ అనే మూవీ తో కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పక్కా కమర్షియల్ , రామబాణం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిలిచాయి. మరి బీమా మూవీ తో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మార్చి 8 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc

సంబంధిత వార్తలు: