రకుల్ పెళ్లి డ్రెస్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
అతి తక్కువ కాలంలోనే టాప్‌ హీరోయిన్ గా దూసుకుపోయింది అందాల పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. చేతినిండా సినిమాలతో , వరస హిట్స్ తో , గ్లామర్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ. రకుల్ ప్రీత్ సింగ్  ప్రేమికుడు జాకీ భగ్నానీ ని గోవా లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. రకుల్-జాకీ భగ్నానీల వివాహానికి చాలామంది బాలీవుడ్ సెలెబ్రటీస్ హాజయ్యారు. రకుల్ అండ్ జాకీ భగ్నానీలు క్రీమ్ కలర్ డిజైనర్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. 

రెండు రోజుల తర్వాత ఈరోజు శుక్రవారం తన పెళ్లి వీడియో ని అందాల పంజాబీ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రకుల్ ప్రీత పెళ్లి కూతురు అలంకరణలో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైన రకుల్ అందంగా నడుస్తూ డాన్స్ చేసుకుంటూ బంధువులు, స్నేహితులు మధ్య నుంచి జాకీ దగ్గరకి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన డ్రెస్ తరుణ్ తహిలియాని లెహంగాలో స్పెషల్గా డిజైన్ చేశారు.లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో తరుణ్ లెహంగా డిజైన్ వాళ్ళు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. రకుల్ తన పెళ్ళిలో ధరించిన డ్రెస్ను

 చాలా మంది కళాకారుల సమిష్టి కృషితో..ఆకర్షణీయమైన దంతాలు మరియు బ్లష్ రంగులలో త్రిమితీయ పూల ఆకారంలోకి తీసుకురావడానికి శ్రమించినట్లు డిజైనర్ తరుణ్ తహిలియాని తెలిపారు. అలాగే, తరుణ్ లెహంగా డిజైన్ను పూర్తిగా కళాకారుల చేతితోనే చేసినట్లు..ఇందుకోసం రెండు వేల గంటల సమయం పట్టినట్లు వెల్లడించారు. అందాల పంజాబీ ముద్దుగుమ్మ పెళ్ళిలో అందరినీ ఆకర్షించిన ఈ డ్రెస్ వెనుకాల ఎంత కష్టం ఉందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.అందుకే రకుల్ వేసుకున్న డ్రెస్ ఎంతో సహజ సిద్ధంగా కనిపిస్తూనే..ఆకర్షణకు ప్రాణం పోసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: