బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కించే కళ్ళతో శృతిహాసన్..!

Anilkumar
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ఏడాది సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య, బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఏడాది ఆఖరులో సలార్ మూవీతో మరో సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఏడాదిలో మూడు సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్న కూడా శృతి హాసన్ సినిమాల పరంగా స్పీడ్ లేదు.సెలక్టివ్ గానే మూవీస్ చేస్తోంది. ఎక్కువ టైం తన మ్యూజిక్, ఫ్యాషన్ ఈవెంట్స్, బాయ్ ఫ్రెండ్ కోసం స్పెండ్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు డెకాయిట్ అనే సినిమాలో నటిస్తోంది. అడవి శేష్ ఈ చిత్రంలో శృతి హాసన్ కి జోడీగా నటిస్తున్నాడు. యాక్షన్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. సలార్ పార్ట్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయిన కథ నేరేషన్ మొత్తం శృతి హాసన్ పాత్ర మీదనే నడుస్తుంది. కాగా శృతి హాసన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు అభిమానులకు అందాల కనువిందు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే

తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ ధరించి మైండ్ బ్లాంక్ చేస్తోంది శ్రుతి. బ్లాక్ గ్లామర్ డ్రెస్ హై బూట్స్ ధరించి హాలీవుడ్ బ్యూటీ రేంజ్ లో కనిపిస్తుంది. నాజుకు నడుము అందాలతో కవ్విస్తూనే చూపులతో మత్తెక్కిస్తోంది. శృతిహాసన్ వయసుతోపాటు ఆమె అందం కూడా పెరుగుతోంది. అదే రేంజ్ లో అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: