బాగా నవ్వించే... సుందరం మాస్టర్?

Chakravarthi Kalyan
వైవా హర్ష... మంచి కామెడీ టైమింగ్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న హర్ష... ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై మంచి కామెడీ నటుడిగా గుర్తింపు పొందారు. చాలా సినిమాల్లో తన హస్యంతో అలరించిన హర్ష... ఇప్పుడు లీడ్ రోల్ పోషించి... తనే సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించడానికి ‘సుందరం మాస్టర్’గా మన ముందుకు వచ్చాడు. డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని మాస్ మహరాజ్ రవితేజ నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కించారు.  విడుదలకు ముందే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్  చేసుకుంది. మరి థియేటర్లలో సినిమాని ప్రేక్షకులు ఏమాత్రం ఏంజాయ్ చేస్తున్నారో రివ్యూలో చూద్దాం పదండి.

కథ: సుదరం మాస్టర్ (వైవా హర్ష) ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే(కమెడియన్ హర్ష వర్ధన్) పాఠశాలకు వచ్చి... అక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరినీ పరిశీలించి... సుందరం మాస్టర్ ని ఓ పని కోసం ఎంచుకుంటారు. అదేంటంటే... బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గత 90 ఏళ్లుగా మిరియాల మెట్ట అనే ఓ ఊరు ఉంది. ఆ ఊళ్లోకి బయటి వాళ్లకి ప్రవేశం లేదు. మొదటిసారి వాకితి ఇంగ్లీష్ టీచర్  కావాలని ఉత్తరం రాశారని... ఆ ఊర్లో ఏదో విలువైందని దాన్ని కనుక్కోవడానికి నిన్ను పంపుతున్నామంటారు. ఆరు నెలల్లో దానిని కనిపెడితే నీకు డీయీవో ప్రమోషన్ వస్తుందని చెబుతాడు ఎమ్మెల్యే. దాంతో అసలే కట్నం మీద అత్యాశతో వున్న సుందరం మాస్టర్... డీయీవో అయితే మరింత ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడి ఆ ఊరికి వెళ్లడానికి ఒప్పుకుంటారు.  ఎక్కడో అడవుల్లో ఉన్న ఆ కుగ్రామానికి సుందరం మాస్టరు వెళతాడు. అయితే ఆ ఊళ్లో వాళ్లందరికి ఇంగ్లీష్ మాట్లాడటం పర్ ఫెక్ట్ గా వచ్చని తెలుసుకుని సుందరం ఒకింత ఆశ్చర్యపోతాడు. తాను ఇంగ్లిష్ ఆల్ఫబెట్స్ తో మొదలు పెడితే... వాళ్లకు ఇంగ్లీష్ మాట్లాడటం పర్ ఫెక్ట్ గా వచ్చని తెలుసుకుని... ఆ తరువాత స్పెల్లింగ్స్ నేర్పించడం మొదలు పెడితే... అవి కూడా వచ్చని వారు చెప్పడంతో సుందరం మాస్టర్ ఒకింత డైలమాలో పడతాడు. తమకు ఇంగ్లిష్ నేర్పించడానికి వచ్చిన టీచర్... అసలు టీచరే కాదని... తనకు ఇంగ్లిష్ రాదని, అతన్ని ఇంగ్లీష్ లో తిట్టి... 15 రోజులు టైం ఇచ్చి తర్వాత నీకు పరీక్ష పెడతాము... పాస్ అయితే ఓకే, లేకపోతే ఉరేసి చంపేస్తాం అంటారు ఊరి పెద్ద(బాలకృష్ణ నీలకంఠాపురర్).  అతని కొడుకు కొన్ని ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్స్ చెప్పాడు, అతను చనిపోవడంతో మాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశామని, బయట వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయకూడదని మా ఊరు దారులన్నీ తీసేసాం అంటూ ఆ ఊరి గురించి అన్ని విషయాలు చెప్తాడు. సుందరం ఎలాగోలా ఓజా సహాయంతో ఆ ఊరివాళ్ళు పెట్టే పరీక్ష పాస్ అయి... ఆ ఊర్లో దొరికే విలువైన దాని గురించి వెతుకుతుంటే, కొంతమంది ఆ ఊరి గ్రామ దేవత విగ్రహం అని చెప్పడంతో చూడటానికి వెళ్తే అక్కడ ఆ విగ్రహం ఉండదు. అసలు ఆ విగ్రహం ఏమైంది? నిజంగానే విగ్రహం విలువైందా? సుందరం మాస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ భాషకు స్పెల్లింగ్స్ నేర్పించాడా? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? వాళ్ళకి నలుపు రంగు అంటే ఎందుకిష్టం?  తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ... కథనం విశ్లేషణ: దర్శకుడు ఎంచుకున్న కథ... కథనం వైవిధ్యంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ఉన్న కథలు మనం చూసుండం. మనం నిత్యం ఏదో ఒక సందర్భంలో ఇంకా కొన్ని మారుమూలన ఉండే కుగ్రామాల గురించి... కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటివి రియల్ లైఫ్ లో కూడా నిత్యం పత్రికల్లో చదువుతూనే ఉంటాం. అలాగే మిరియాల మెట్ట అనే ఊరిని తీసుకొని వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలనే కథతో సుందరం మాస్టర్ పాత్రని రాసుకున్నారు.
ఆ ఊరిని బ్రిటిషర్లు నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్ ని గ్రాఫిక్స్ లో వాడుకొని కథ చెప్పడం బాగుంది. ఓవరాల్ గా మొదటి హాఫ్ హాస్యంతోనూ... సెకెండాఫ్ ని కొంత ఫిలాసఫీతోనూ నడిపించారు ‘సుందరం మాస్టర్’. ఇలాంటి కొత్త జోనర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులను సుందరం మాస్టర్ కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాడు.
షార్ట్ ఫిలింస్ లోనూ, వెండితెరపైనా తన కామెడీతో ఇన్నాళ్లు అలరించిన  వైవా హర్ష...  ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సుందర్ మాస్టర్ లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ పాత్రలో మరే ఇతర నటుడిని ఊహించుకోలేనంతగా ఒదిగిపోయి నటించారు హర్ష. అతనికి జోడీగా నటించిన దివ్య శ్రీపాద... ఆ ఊర్లో ఓ అనాథ పిల్లగా నటించి తన పాత్రకు న్యాయం చేసింది. గ్రామ పెద్దగా బాలకృష్ణ నీలకంఠాపురం, ఎమ్మెల్యేగా కమెడియన్ హర్షవర్దన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఈ తరహా సినిమాలకు ఎలాంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారో... వారిని టార్గెట్ చేసి తీసిన మూవీ ఇది. అలాగే ఈ సినిమాని సాంకేతికంగా కూడా చాలా ఉన్నతంగా నిర్మించారు. ముఖ్యంగా సినిమాని అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు.  కథ కూడా కొత్తగా బాగుంది. కథనం కూడా ఆసక్తిగా బోర్ కొట్టకుండా సాగుతుంది. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు . నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్: 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: