ఈ మినీ వార్ విజేత ఎవరు ?

Seetha Sailaja
టాప్ హీరోల సినిమాల విడుదల లేనప్పుడు చిన్న సినిమాలు క్యూ కట్టడం ఒక అలవాటుగా మారింది. ఈవారం మళ్ళీ అదే జరుగుతోంది. గతవారం విడుదలైన సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’ కు ఓపెనింగ్ రోజున కలక్షన్స్ బాగా వచ్చినప్పటికీ ఆతరువాత రోజు నుండి కలక్షన్స్ తగ్గిపోవడంతో ఈమూవీ హిట్ లిస్టులోకి చెరలేక పోయింది.

అయితే ఈమూవీ ఈవారాంతానికి బ్రేక్ ఈవెన్ అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈసినిమా ఫలితం ఇంకా తెలియకుండానే ఈవారం ఏకంగా 9 సినిమాలు ఒక దానిపై ఒకటి పోటీగా విడుదల అవ్వడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే కామెడీ రోల్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు పొందిన హర్ష చెముడు హీరోగా నటించిన ‘సుందరం మాస్టర్’ ఈవారాం విడుదల కాబోతోంది.

ఈమూవీ ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈమూవీకి మంచి ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈవారం కమెడియన్ గా పేరు గాంచిన అభినవ్ గోమటం హీరోగా పరిచయమవుతున్న ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ ఎక్కువగా యూత్ ని ఆకర్షించే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇక వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ చిత్రం ‘వ్యూహం’ కోర్టు అడ్డంకులను దాటుకుని ఈవారం విడుదలకాబోతోంది.

ఈవారం మలయాళంలో సెన్సేషన్ గా నిలిచిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘భ్రమ యుగం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినిమాకు ప్రమోషన్ అంతంత మాత్రంగా ఉండటంతో ఎంతవరకు సక్సస్ అవుతుంది అన్న సందేహాలు ఉన్నాయి. ఇక క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దృష్టిలో పడిన యశస్వి దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిద్దార్థ్ రాయ్’ తో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈమూవీ పై ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు ఉండవచ్చు అని అంటున్నారు. ఈసినిమాలతో పాటు ‘14 డేస్ లవ్’ ‘ప్రేమలో ఇద్దరు’  ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ ‘సుమతి’ సినిమాలు కూడ ఉండటంతో ఈ మినీ రేస్ లో విజేత ఎవరు అన్న ఆశక్తి అందరిలోను ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: