రామ్ చరణ్ తో రొమాన్స్ కి రెడీ అయిన జాన్వి కపూర్..!?

Anilkumar
శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ బాలీవుడ్  లో ‘దఢక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటికే దేవర  సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ‘తంగం’ అనే క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాతో

 కమర్షియల్ సక్సెస్ సాధించి మరిన్ని కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తుంది. Rc 16 లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవలి ఇంటర్వ్యూలో అధికారికంగా ధృవీకరించినట్టు సమాచారం. జాన్వీ త్వరలో RC16 షూటింగ్‌ను ప్రారంభించనుందని, ఆమెకు తన తల్లి దివంగత శ్రీ దేవి ఆశీస్సులు ఉన్నాయని ఆయన అన్నారు. బోనీ కపూర్ చేసిన ఈ ప్రకటన అనేక రూమర్స్ కు చెక్ పెట్టినట్టయ్యింది.

ఇప్పుడు RC16 లో మహిళా ప్రధాన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. దేవర తర్వాత టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఇది రెండవ చిత్రం. ఇది నిస్సందేహంగా తెలుగు లో మంచి ఛాన్స్. వృద్ధి స్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా జూనియర్ నటిస్తున్న దేవర రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 10, 2024న వస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రకటన ఖచ్చితంగా మెగా అభిమానులను షాక్‌కి గురిచేసింది. 'గేమ్ ఛేంజర్' కు లెజెండరీ డైరెక్టర్ S.శంకర్ తొలిసారిగా రామ్ చరణ్‌కి దర్శకత్వం వహించిన చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: