రుక్మిణి అప్పుడే కోటి అనేస్తుందా..?

shami
కన్నడ నుంచి వచ్చిన ప్రతి హీరోయిన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే కన్నడ నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ తెలుగులో అదరగొట్టేస్తుండగా లేటెస్ట్ గా కన్నడ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది అందాల భామ రుక్మిణి వసంత్. అమ్మడు చేసిన సప్త సాగరాలు దాటి సినిమా తెలుగు ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
ఆ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ రుక్మిణి ప్రేమలో పడిపోయారు. తెలుగులో ఇప్పటికే రవితేజ తో సినిమా ఓకే అయినట్టు తెలుస్తుండగా మరో సినిమా కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ లో కూడా అమ్మడు లక్కీ ఛాన్స్ పట్టేసింది. శివ కార్తికేయన్ మురుగదాస్ కాంబో సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తుంది.
ఇక తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే భారీ డిమాండ్ చేస్తుంది రుక్మిణి. అమ్మడు ప్రస్తుతం కన్నడలో పాతిక ముమంపై లక్షల దాకా తీసుకోగా తెలుగులో మొదటి సినిమాకే 70 లక్షల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ఇక టాలీవుడ్ లో తనకు ఉన్న క్రేజ్ చూసి ఇప్పుడు కోటి ఇస్తేనే సినిమా చేస్తానని అంటుందట. ఎలాగు తమిళంలో ఒక సినిమా చేస్తుంది కాబట్టి తెలుగులో సత్తా చాటే ఛాన్స్ ఉంటుంది.

తెలుగులో కోటి అందుకుంటుంది అంటే తప్పకుండా రుక్మిణి ఇక్కడ టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అటు తమిళంలో కూడా శివ కార్తికేయన్ తో జత కడుతుంది అంటే అక్కడ స్టార్స్ కన్ను కూడా రుక్మిణి మీద పడుతుంది. తప్పకుండా కోలీవుడ్ లో కూడా అమ్మడు వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంటుందని చెప్పొచ్చు. సౌత్ లో ప్రస్తుతం రుక్మిణి వసంత్ ట్రెండింగ్ లో ఉంది. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య కూడా బీభత్సంగా పెరిగారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: