టాలీవుడ్‌ ఇండస్ట్రీని విమర్శిస్తున్న బాలయ్య హీరోయిన్....!!

murali krishna
టాలీవుడ్‌ సినిమాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వస్తాయని.. నటీనటులు, టెక్నీషియన్లు నిబద్ధతతో పనిచేస్తారని ఒక నమ్మకం ఉంది.దానికి తగ్గట్టుగానే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప వంటి సినిమాలు ఉండటంతో ఇప్పుడు అందరి చూపు టాలీవుడ్‌పైనే ఉంది. ఇలా తన ఖ్యాతిని అంతకంతకు పెంచుకుంటూ పోతున్న తెలుగు ఇండస్ట్రీపై రాధికా ఆప్టే విషం కక్కారు. టాలీవుడ్‌లో హీరోయిన్లను చాలా దారుణంగా చూస్తారని.. వాళ్లకు షూటింగ్స్‌ విషయంలో క్లారిటీ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాధికా ఆప్టే గతంలోనే చేసినప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాధికా ఆప్టే.. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. ఇన్ని భాషల్లో నటించినప్పటికీ తాను ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అని రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. టాలీవుడ్‌లో మహిళల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని సంచలన వ్యాఖ్యలు చేసింది. సెట్స్‌లో హీరోయిన్‌ను మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించింది. టాలీవుడ్‌లో పురుషాధిక్యం అధికంగా ఉంటుందని ఆరోపించింది. ఇక షూటింగ్స్‌ విషయంలోనూ టాలీవుడ్‌లో క్లారిటీ ఉండదని పేర్కొంది. ఇష్టానుసారంగా షూటింగ్‌లను రద్దు చేస్తారని.. ఒకవేళ షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసినా కూడా దానిపై కనీస సమాచారం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధమైన ఇబ్బందులు తనకు చాలాసార్లు ఎదురయ్యాయని అన్నారు. దీంతో ఆ ఇండస్ట్రీలో తన అవసరం అంతేనని గ్రహించి దూరంగా ఉన్నానని పేర్కొన్నారు.టాలీవుడ్‌ ఇండస్ట్రీని అందరూ పొగుడుతుంటే.. రాధికా ఆప్టే మాత్రం ఇలా విమర్శించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌ సాధిస్తుండటంతో అక్కసుతోనే ఇలా విషం చిమ్ముతోందని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా, రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, ధోనీ, లెజెండ్‌, లయన్‌ సినిమాల్లోనే నటించింది. వీటిలో బాలకృష్ణ సినిమాలు మినహా మిగిలినవి అన్నీ ద్విభాషా చిత్రాలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: