నాని... బలగం వేణు కాంబో మూవీకి ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ లాక్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తన తర్వాత మూవీ ని బలగం మూవీ దర్శకుడు వేణు తో చేసే అవకాశాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా బలగం వేణు ... నాని కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ వాస్తవం అని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా వేణు , నాని కి ఓ కథను వినిపించాడట. ఆ కథ దాదాపుగా నాని కి నచ్చిందట.

దానితో వెంటనే ఈ దర్శకుడితో పని చేయడానికి నాని గ్రీన్ సిగ్న ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వేణు , నాని కి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ రివెంజ్ డ్రామా కథను వినిపించినట్లు ... ఆ కథ నాని కి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కమీడియన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వేణు ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్ గా స్కిట్ లను వేసి బుల్లి తెర ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ దర్శకుడు బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తో ఈయన దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన దర్శకత్వంలో నాని హీరో గా రూపోందబోయే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: