"ఊరు పేరు భైరవకోన" మూవీకి ప్రీమియర్ తో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నప్పటికీ ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకుంటూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించాడు. గతంలోనే సందీప్ , వి ఐ ఆనంద్ కాంబోలో టైగర్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా ఆ సమయంలో పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే విరి కాంబో లో రూపొందిన రెండవ మూవీ కావడంతో మొదటి నుండే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో వర్ష బోల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించారు.
 

ఈ సినిమా ఫిబ్రవరి 16 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కంటే రెండు రోజులు ముందు గానే అనగా ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ బృందం చాలా ప్రదేశాలలో ప్రదర్శించింది. అందులో భాగంగా ఈ మూవీ ప్రీమియర్ షో లకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రీమియర్ షో లకు గాను వచ్చిన కలెక్షన్ లను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ప్రీమియర్ షో లకు గాను 1.1 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు భారీ కలక్షన లను బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: