రుక్మిణి ఖాతాలో ఒక తమిళ సినిమా..!

shami
సప్త సాగరాలు దాటి సినిమాతో హీరోయిన్ గా సౌత్ ఆడియన్స్ కు పరిచయమైంది రుక్మిణి వసంత్. కన్నడ లో రిలీజైన ఈ సినిమా రెండు భాగాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ సినిమా తెలుగు లో కూడా రిలీజై ఇక్కడ కూడా రుక్మిణి కి మంచి క్రేజ్ తెచ్చేలా చేసింది. సప్త సాగరాలు చూసిన తర్వాత తెలుగు నుంచి కూడా రుక్మిణికి ఒకటి రెండు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ నుంచి కూడా రుక్మిణి ఆఫర్ అందుకుందని తెలుస్తుంది.
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. క్రైం థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమాలో రుక్మిణి క్యారెక్టర్ కి మంచి వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. సప్త సాగరాలు సినిమా ప్రేమకథ గా వచ్చింది. రక్షిత్ శెట్టి నటించి నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ తన నటనతో ఆకట్టుకుంది.
ప్రేమ కథను కూడా రెండు భాగాలుగా చెప్పొచ్చని ప్రూవ్ చేశారు రక్షిత్ శెట్టి. హేమంత్ ఎం రావు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సప్త సాగరాలు అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా రుక్మిణి వసంత్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. తప్పకుండా రుక్మిణికి ఇంకా మరిన్ని ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. ఎలాగు శివ కార్తికేయన్ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న రుక్మిణి తెలుగు, తమిళ భాషల్లో అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. రుక్మిణి ని చూస్తే ఒకప్పటి అభినయ తారలు గుర్తుకొస్తారు. సో కచ్చితంగా గ్లామర్ సైడ్ కాకపోయినా అభినయ తారగా కచ్చితంగా రుక్మిణికి టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: