ఇండస్ట్రీలో ముగ్గురిని ప్రేమించా.. ఓపెన్ అయిన సందీప్ కిషన్?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రేజ్ ఉంటుంది కాబట్టే..  హీరో హీరోయిన్లకు సంబంధించిన ఏదైనా విషయం తెరమీదికి వచ్చింది అంటే చాలు అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు హీరో హీరోయిన్లు తమ ప్రొఫెషనల్ విషయాలను మాత్రమే అభిమానులకు చెప్పేవారు. పర్సనల్ విషయాలు ఒక్కటి కూడా బయటికి రాకుండా ఎంతో జాగ్రత్త పడేవారు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో నేటి టెక్నాలజీ యుగంలో సినీ సెలబ్రిటీలు అనే విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక అందరూ సెలబ్రిటీలు ఏకంగా పర్సనల్ విషయాలను ఏకంగా తమ లవ్ స్టోరీలను కూడా అభిమానులతో ఎన్నోసార్లు చెబుతున్నారు. ఇక ఇటీవల సందీప్ కిషన్ కూడా తన లైఫ్ లో ఉన్న లవ్ స్టోరీ ల గురించి ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న ఈ యంగ్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు సందీప్ కిషన్. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ ఇప్పుడు వరకు ఎందుకో సరైన గుర్తింపును మాత్రం సంపాదించుకోలేకపోయాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఊరి పేరు భైరవకోన అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు సందీప్ కిషన్.

 ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లను సిన్సియర్ గా లవ్ చేసాను అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. ఏకంగా ముగ్గురు హీరోయిన్లను సీరియస్ గా ప్రేమించినట్లు సందీప్ కిషన్ వెల్లడించాడు. ఒకరితో నాలుగేళ్లు మరొకరితో రెండేళ్లు ఇంకొకరితో రెండున్నర ఏళ్ల పాటు లవ్ లో ఉన్నాను. కానీ ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది. కానీ వారి పేర్లు ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఇక నా పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే గతంలో రెజినాతో లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా అవాస్తవం మేమిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి ఎవరికీ తెలియకుండా మూడు ప్రేమాయణాలు భలే మేనేజ్ చేశావు గురు అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: