వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "గడార్ 2"..!

Pulgam Srinivas
సన్నీ డియోల్ హీరోగా రూపొందిన గాడార్ 2 మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మనీష్ శర్మ దర్శకత్వం వహించగా ... అమీషా పటేల్ ఈ సినిమాలో సన్నీ డియోల్ కు జోడి గా నటించింది. ఇకపోతే ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ఆ సమయం లో కనెక్షన్ ల వర్షం కురిపించిన గడార్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది.

ఇకపోతే గాడార్ 2 సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన గడార్ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో గాడార్ 2 మూవీ పై మొదటి నుండి హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ఇక థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అందులో భాగంగా ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లో వరల్డ్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జీ సంస్థ ఈ సినిమాను ఫిబ్రవరి 18 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమాకు బుల్లి తెర ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: