విశ్వక్ సేన్ చెప్పబోతున్న లైలా లవ్ స్టోరీ..!

shami
ఓ పక్క హీరోగా చేస్తూ మరోపక్క డైరెక్షన్ కూడా చేస్తూ తన టాలెంట్ చూపిస్తున్నాడు యువ హీరో విశ్వక్ సేన్. హీరోగా కాకపోతే డైరెక్టర్ గా ఇలా సినిమా కోసం బిజీ బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విశ్వక్ మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారని తెలుస్తుంది.
విశ్వక్ సేన్ ఇప్పటికే ఫలక్ నుమా దాస్, దాస్ కాద్ ధంకీ సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక తన డైరెక్షన్ లో హ్యాట్రిక్ సినిమా చేయాలని చూస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలో ఆల్రెడీ ఒక కథ రాసుకుని దానికి టైటిల్ కూడా పెట్టారని తెలుస్తుంది. విశ్వక్ సేన్ డైరెక్షన్ లో వస్తున్న నెక్స్ట్ సినిమా టైటిల్ లైలా అని తెలుస్తుంది. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటిస్తాడని టాక్.
ఇక ఈ సినిమా తో పాటుగా విశ్వక్ సేన్ మరో రెండు కొత్త సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి కల్ట్ కాగా మరొకటి మెకానిక్ రాకీ అని తెలుస్తుంది. ఈ సినిమాలతో విశ్వక్ సేన్ మరోసారి సత్తా చాటనున్నాడు. యువ హీరోల్లో దూకుడు మీద సినిమాలు చేసే వారిలో విశ్వక్ సేన్ ఒకరు. వరుస సినిమాలతో తన ఫ్యాన్స్ ని అలరిస్తుంటాడు. తెలుగులో ఉన్న యంగ్ హీరోల్లో ఈమధ్య కాలంలో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న వారి లో విశ్వక్ సేన్ ఒకరు. రాబోతున్న సినిమాలతో కూడా మంచి టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా సమ్మర్ రేసు లో దిగుతుందని తెలుస్తుంది. విశ్వక్ సేన్ గామి సినిమా కూడా మార్చి 8 న రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: