డివివి బ్యానర్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా నిర్మాణ సంస్థలలో డి వి వి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఒకటి. ఇకపోతే ఇప్పటికే v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ సంస్థలో అనేక సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం కూడా ఈ బ్యానర్ లో అనేక సినిమాలు ఉన్నాయి . మరి ప్రస్తుతం వీరు ఏ సినిమాలను నిర్మిస్తున్నారు ..? అలాగే ఏ సినిమాలకు కమిట్ అయి ఉన్నారు అనే విషయాలను తెలుసు కుందాం.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరిని తెలిసిందే. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమాతో పాటు ప్రస్తుతం డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వివేక ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాను కూడా రూపొందిస్తున్నారు. ఇలా ఇప్పటికే రెండు మూవీ లను రూపొందిస్తున్న ఈ బ్యానర్ వారు మరికొన్ని రోజుల్లోనే తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరో గా మరో మూవీ ని రూపొందించబోతున్నారు. ఇలా ఈ మూడు మూవీ లతో పాటు మరికొన్ని రోజుల్లోనే ఈ బ్యానర్ వారు నాని హీరో గా సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ ని రూపొందించబోతున్నారు. ఇలా ప్రస్తుతం ఈ బ్యానర్ వారు రెండు సినిమాలను నిర్మిస్తూ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

dvv

సంబంధిత వార్తలు: