ఈ వారం రిలీజ్ కి రెడీగా ఉన్నా 3 సినిమాల రన్ టైమ్... సెన్సార్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ వారం కొన్ని సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి ..?  ఆ మూవీ లు ఎంత రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ..? ఆ సినిమాలకు సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈగల్ : మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈ సినిమా రేపు అనగా ఏప్రిల్ 9 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , కావ్య ధాపర్ హీరోయిన్ లుగా నటించగా ... ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల నిడివితో  ప్రేక్షకుల ముందుకు రానుంది.
లాల్ సలాం : విష్ణు విశాల్ హీరో గా రూపొందిన ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 32 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రూ లవర్ : ఈ మూవీ ఫిబ్రవరి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 26 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: