'ఆపరేషన్ వాలెంటైన్'.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్!

Anilkumar
మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి రీసెంట్ గా రిలీజ్ చేసినవా 'వందేమాతరం' అనే పాట ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై ఆసక్తిని పెంచింది.

దేశభక్తి అంశాలతో ఇంటెన్స్ యాక్షన్ తో పాటూ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండబోతుందని తాజాగా సెకండ్ సింగిల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ రోజు 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ నుంచి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. 'గగనాల తేలాను.. నీ ప్రేమలోనా..' అంటూ సాగే ఈ పాట ఫుల్ రొమాంటిక్ మోడ్ లో సాగింది. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ ని ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాయగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు. హీరో, హీరోయిన్లు వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ మధ్య రొమాంటిక్ గా చిత్రీకరించిన ఈ సాంగ్ ఆడియన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో వరుణ్ తేజ్,

మానుషి చిల్లర్ ఇద్దరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే లవ్ బర్డ్స్ గా కనిపించారు. సాంగ్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. విజువల్ సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ మెలోడీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది  ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్' మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఆయన గత చిత్రాలు 'గని', 'గాండీవధారి అర్జున’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ప్లాప్స్ అయ్యాయి. దీంతో ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నాడు ఈ మెగా హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: