ధనుష్ డైరెక్టర్ తో తలపతి విజయ్ లాస్ట్ మూవీ?

Anilkumar
కోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్ తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా తన పార్టీ పేరును అధికారికంగా అనౌన్స్ చేసి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావడంతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కానున్న నేపథ్యంలో ఆయన చివరగా ఒకే ఒక్క ప్రాజెక్ట్ చేసి సినిమాలకు విరామం తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన లాస్ట్ మూవీ విషయంలో రోజుకో వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దళపతి విజయ్ లాస్ట్ సినిమా ఉండబోతోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం కార్తిక్ సుబ్బరాజ్, హెచ్. వినోద్ లాంటి కోలీవుడ్ డైరెక్టర్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఈ లిస్టులో మరో కోలీవుడ్ డైరెక్టర్ చేరాడు.తమిళంలో 'వడ చెన్నై', 'అసురన్', 'విడుదలై' వంటి సినిమాలతో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెట్రి మారన్ ఇప్పుడు దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా రా అండ్ రస్టిక్ సినిమాలు తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ తో సినిమా చేయాలని తలపతి విజయ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు.

ఇక ఎట్టకేలకు తన చివరి చిత్రాన్ని ఈ దర్శకుడితోనే చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియా ద్వారా సమాచారం అందుతోంది. దళపతి విజయ్ పొలిటికల్ ఎలిమెంట్స్ తో కూడిన కథతోనే తన చివరి సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఆ అవకాశాన్ని వెట్రిమారన్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.DVV దానయ్య - తలపతి విజయ్ కాంబినేషన్ ప్రాజెక్టుని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2025 సంక్రాంతికి ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ విశ్వంభర, నాగార్జున బంగార్రాజు పార్ట్-3 తో పాటూ హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' వంటి సినిమాలు రాబోతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: