నేను చరణ్ అక్కడే పుట్టాము.. అందుకే ఆ ప్లేస్ మా ఇద్దరికీ స్పెషల్..!?

Anilkumar
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఉపాసన దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరికీ క్లీన్ కారా అన్న పాప కూడా ఉంది. ఇక తరచూ తనకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన నేను చెన్నై సిటీలోనే పుట్టాను అని చెప్పకు వచ్చింది. రామ్ చరణ్ సైతం చెన్నైలోనే పుట్టాడు అంటూ ఉపాసన చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నాకు చెన్నై సిటీ అంటే చాలా ఇష్టం అని కూడా తెలిపారు ఉపాసన.

అంతేకాదు రామ్ చరణ్ కి కూడా చెన్నై సిటీ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు ఉపాసన. అలా ఇద్దరికీ చెన్నై సిటీ అంటే చాలా ఫేవరెట్ అని మా ఇద్దరికీ చెన్నై సిటీ చాలా ప్రత్యేకం అని ఉపాసన చెప్పడంతో ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కామినేని కొణిదేల కుటుంబాలపై తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు సైతం అభిమానాన్ని చూపించడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది ఉపాసన. అంతేకాదు వారిపై అభిమానాన్ని చూపిస్తున్న అందరికీ కూడా థాంక్స్ అని తెలిపింది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్

సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికి రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. జూన్ నెలాఖరు నాటికి గేమ్ ఛేంజర్ షూట్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. శంకర్ పర్ఫెక్ట్ గా ఉండేలా ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. గేమ్ ఛేంజర్ సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: