తెలుగు లో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటి మనులలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందినటువంటి ఈగల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినటువంటి అనుపమ పరమేశ్వరన్ కూడా విచ్చేసింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుపమ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన చంకీలు పొదిగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది.
ఇక ఈవెంట్ కు ఈ మద్దు గుమ్మ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో రావడంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈ ముద్దు గుమ్మ వైపే తిరిగాయి దానితో ఈమె కూడా కెమెరాలకు అదిరిపోయే యాంగిల్స్ లో పోజులు ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈగల్ మూవీ ఈవెంట్ లో భాగంగా అనుపమ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనుపమ కూడా ఈగల్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఈ బ్యూటీ కి ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.